దేవా నీ తలంపులు అమూల్యమైనవి
deevaa nee thalanpulu amuulyamainavi
🎵 TG-2198🌐 Telugu
పల్లవి
దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ నా యెడల నీ కరుణ సర్వ సదా నిలుచుచున్నది (2) ||దేవా||
1వ చరణం
స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే స్తుతి పాడేను హృదయముతో (2) స్తుతించి వర్ణించి ఘనపరతున్ నీవే నా రక్షకుడవని ||దేవా||
2వ చరణం
మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి వెదుకలేదు ప్రభువా నేను వెదకితివి ఈ పాపిని అద్భుతమైనది సిలువ దృశ్యం ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి ప్రభును వర్ణింప నశక్యము ప్రభువే సహించె దుఃఖము ఎట్లు మౌనముగా నుందు ప్రభు చెల్లింపక స్తోత్ర గీతము కాలమంతా పాడుచుండెద నీ ప్రేమ అపారమైనది