దేవాది దేవా ప్రభువుల ప్రభూ

deevaadi deevaa prabhuvula prabhuu

🎵 TG-1967🌐 Telugu
పల్లవి

దేవాది దేవా ప్రభువుల ప్రభూ రాజుల రాజా హల్లెలూయ నీ రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి పరలోక రాజ్య ప్రజలతో జేర్చి పరలోక పాటన్ నా కొసగితివి (2)         ||దేవాది దేవా||

1వ చరణం

జీవిత నావలో తుఫాను రేగ భయపడకుడని అభయము నిచ్చి జయప్రదముగా నన్ను నడిపించి జయజీవితము నా కొసగుచున్న పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి అరమర లేక నన్నాదరించి పరలోక దర్శనంబిచ్చితివి మరణ పాత్రులం యిద్ధరణిలోన దురిత ఋణముల స్మరణను మాన్పి ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము నీ రాజ్యమందు రాజులన్ జేసి శోధనగాధల కష్టములలో నా దుఃఖములలో నే నేడ్వకుండా నీ దయ నాపై నిండార నింపి ఓదార్చి నన్ను నీ దారినడుపు ప్రతి వత్సరము దయతోడ నింపున్ ప్రభు జాడలు సారము జల్లున్ ప్రతి బీడునూ సారము చిలకన్ ప్రతి పర్వతము ఆనందించున్ పరలోక పరిశుద్ధ సంఘంబు యెదుట సర్వశక్తిగల క్రీస్తుని యెదుట పరలోక నూతన గీతము పాడ జేర్చితివి నన్ నీ జనమునందు

Report Error