దేవర నీ దీవెనలు ధారాళముగను

deevara nee deevenalu dhaaraallamuganu

🎵 TG-2520🌐 Telugu
పల్లవి

దేవర నీ దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమే దిగనిమ్ము పావన యేసుని ద్వారగను (2) దంపతులు దండిగ నీ ధాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై ||దేవర నీ||

1వ చరణం

ఈ కవను నీ కరుణన్ ఆకరు వరకును లోకములో శోకము లేకయే ఏకముగా బ్రాకటముగను జేకొనుము ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నొప్పుచు దా మొప్పిన చొప్పున దప్పకను మెప్పుగ బ్రతుకగ బంపు కృపన్ తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగా గాపుగ బ్రాపుగ దాపునుండి యాపదలన్నియు బాపుచును సాధులుగన్ జేయుటకై శోధనలచే నీవు శోధింపగా కదలక వదలక ముదమున నీ పాదము దాపున బాదుకొనన్ మెండుగ భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగ దండిగ నండనుండి వెండియు వానిని ఖండించావే యిద్దరు వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగ సిధ్ధపడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగాన్ వాసిగ నీ దాసులము చేసిన ఈ మొఱ్ఱల్ దీసికొని మా సకలేశ్వర నీ సుతుడ యేసుని పేరిట బ్రోవుమామేన్

Report Error