దేవుడు మనకు ఎల్లప్పుడు - తోడుగ నున్నాడు
deevuddu manaku ellappuddu - toodduga nunnaaddu
1వ చరణం
ఏదెనులో ఆదాముతోనుండెన్ -హానోకుతోడ నేగేను ధీర్గదర్శకులతో నుండెను - ధన్యులు దేవుని గలవారు "తోడుగ"
2వ చరణం
దైవాజ్ఞను శిరసావాహించి - దివ్యముగ నబ్రాహము కన్న కుమరుని ఖండించుటకు - ఖడ్గమునెత్తిన యపుడు "తోడుగ"
3వ చరణం
యేసేపు ద్వేషించబడి నపుడు - గోతిలో త్రోయ బడినపుడు శోధనలో చెరసాలయందు - సింహాసన మెక్కిన యపుడు "తోడుగ"
4వ చరణం
ఫరోరాజు తరిమిన యపుడు - ఎర్రసముద్రపు తీరమున యోర్దాను నది దాటినపుడు - ఎరికో కూలినా యపుడు "తోడుగ"
5వ చరణం
దావీదు సింహము నెదిరించినపుడు - దైర్యముగ, చీల్చీనపుడు గొల్యాతును హతమార్చినపుడు - సౌలుచే తరమ బడినపుడు "తోడుగ"
6వ చరణం
సింహపు బోనులో దానియేలు - షడ్రకు,మేషకు, అబెద్నెగో అగ్ని గుండములో వేయబడెన్ - నల్గురుగా కనబడినపుడు "తోడుగ'
7వ చరణం
పౌలు బంధించబడినపుడు - పేతురు చెరలో నున్నపుడు అపొస్తులులు విశ్వాసులు - హింసించాబడిన యపుడు "తోడుగ"