దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న

deevudee ila cheereetanduku ennukunna

🎵 TG-1859🌐 Telugu
పల్లవి

దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం అమ్మా అంటూ పిలుచుకొని పొందుకొనెను జన్మం నీకంటూ ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగం కనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం (2) అమ్మా నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో ఆ దైవము సైతము నేర్చె పాఠాలు చల్లని నీ ఒడిలో (2)         ||దేవుడే||

1వ చరణం

కన్న బిడ్డను పరాయి బిడ్డగా పెంచుకున్న మమకారం తన ప్రజల విముక్తికి దేవుడు చేసిన కార్యంలో సహకారం మోషేగా మారిన పసివాడిని దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం ||అమ్మా||

2వ చరణం

సంతతి లేక సవతి పోరుతో విసిగినట్టి దీనత్వం దేవుని సన్నిధి హృదయము పరచి పొందుకొనెను మాతృత్వం హన్నా చేసిన ఆ త్యాగమే కాదా సమూయేలు పొందిన న్యాయాధిపత్యము కొన ఊపిరితో సిలువపైన వేళాడుతున్న క్షణము ఆ దేవ దేవుడు తీర్చుకొనెను తన మాతృమూర్తి ఋణము ప్రియ శిష్యుని దరికి తల్లిని చేర్చి నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం

Report Error