దేవుడొక నగరము మన కొరకై

deevudoka nagaramu mana korakai

🎵 TG-2131🌐 Telugu
పల్లవి

దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండె నుండుటకై (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా (2)        ||దేవుడొక||

1వ చరణం

మేలిమి బంగారము అద్భుత నగరం విలువైన రాళ్ళతో పునాది వేసెను రక్తముచే శుద్ధులై క్షమించబడితిమి మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా నగర ప్రాకారములు ఎత్తైనవి సూర్య కాంతములచే కట్టబడెను ప్రభువే విమోచించి అధికారమిచ్చెను ముత్యాల గుమ్మములు పండ్రెండు గలవు పన్నిద్దరు దూతలు అచ్చట నుండిరి పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు ఆ నగర వీధులు మేలిమి బంగారం ద్వారములు ఎప్పటికి మూయబడవు ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతో గొర్రెపిల్ల సింహాసన మచ్చటుండును ఆయనే దీపము నాలయమై యుండును జీవగ్రంథమందున పేరులున్నవనుచు జయవంతుల కొరకే ఆ నగరం పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు విజయుల మౌదము క్రీస్తుని రక్తముచే

Report Error