దేవుని ప్రేమ ఇదిగో
deevuni preema idigoo
దేవుని ప్రేమ ఇదిగో – జనులార – భావంబునం దెలియరే కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును ||దేవుని||
సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెను సర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే యేసు క్రీస్తను పేరున – రక్షకుడు – వెలసి నాడిలలోపల దోసకారి జనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు పాప భారంబు తోడ – నే ప్రొద్దు – ప్రయాసముల బొందెడి పాపులందరు నమ్మిన – విశ్రాంతి – పరిపూర్ణమిత్తు ననెను సతులైన పురుషులైనన్ – యా కర్త – సర్వ జనుల యెడలను సత్ప్రేమగా నడిచెను – పరలోక – సద్బోధలిక జేసెను చావు నొందిన కొందరిన్ – యేసుండు – చక్కగా బ్రతికించెను సకల వ్యాధుల రోగులు – ప్రభు నంటి – స్వస్థంబు తా మొందిరి గాలి సంద్రపు పొంగులన్ – సద్దణిపి – నీళ్లపై నడచినాడే మేలు గల యద్భుతములు – ఈలాగు – వేల కొలదిగ జేసెను చేతుల కాళ్లలోను – రా రాజు – చేర మేకులు బొందెను పాతకులు గొట్టినారే – పరిశుద్ధ – నీతి తా మోర్వలేకన్ ఒడలు రక్తము గారగ – దెబ్బలు – చెడుగు లందరు గొట్టిరి వడిముళ్లు తల మీదను – బెట్టిరి – ఓర్చెనో రక్షకుండు ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాప నరులను మన్నించు మని తండ్రిని – యేసుండు – సన్నుతితో వేడెను రక్షకుడు శ్రమ బొందగా – దేశంబు – తక్షణము చీకటయ్యెన్ రక్షకుడు మృతి నొందగ – తెర చినిగి – రాతి కొండలు పగిలెను రాతి సమాధిలోను – రక్షకుని – నీతిగల దేహంబును పాతి పెట్టిరి భక్తులు – నమ్మిన – నాతు లందరు జూడగా మూడవ దినమందున – యేసుండు – మృతి గెల్చి లేచినాడు నాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున్ పదునొకండు మారులు – వారలకు – బ్రత్యక్షు డాయె నేసు పరలోకమున కేగెను – తన వార్త – బ్రకటించు మని పల్కెను నమ్మి బాప్తిస్మమొందు – నరులకు – రక్షణ మరి కల్గును నమ్మ నొల్లక పోయెడు – నరులకు – నరకంబు సిద్ధమనెను