దినమెల్ల నే పాడినా కీర్తించినా

dinamella nee paadinaa keerthinchinaa

🎵 TG-1995🌐 Telugu
పల్లవి

దినమెల్ల నే పాడినా కీర్తించినా నీ ఋణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ||దినమెల్ల||

1వ చరణం

గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా (2) నిను విడువనూ ఎడబాయననినా నా యేసయ్య నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని

Report Error