దుర్దినములు రాకముందే – సర్వం
durdinamulu raakamundee – sarvam
🎵 TG-1407🌐 Telugu
పల్లవి
దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2) స్మరియించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2) ||దుర్దినములు||
1వ చరణం
సాగిపోయిన నీడవంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారికోసం పాతాళ వేదనలు తప్పించుకొనలేవు ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు రత్నరాసులేవి నీతో కూడ రావు మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి యేసు క్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని