ఏ రీతి స్తుతియింతునో

ee reethi sthuthiyinthunoo

🎵 TG-1471🌐 Telugu
పల్లవి

ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో నేరములెంచని వాడా – నాదు నజరేయుడా తీరము దాటిన వాడా – నాదు గలలీయుడా ఏ రీతి స్తుతియింతునో… నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడనో యేసువా (2) ||ఏ రీతి||

1వ చరణం

మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివి సకల సంపద విడచితివి – సేవకునిగా మారితివి (2)        ||నా ప్రాణ||

2వ చరణం

వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివి రోత బ్రతుకును మార్చితివి – నీదు సుతునిగ జేసితివి ఇంత ప్రేమకు కారణము – ఎరుగనైతిని నా ప్రభువా ఎన్న తరమా నీ ప్రేమ – సన్నుతించుచు పాడెదను

Report Error