ఏ రీతి స్తుతియింతునో - ఏ రీతి సేవింతునో
ee riiti stutiyintunoo - ee riiti seevintunoo
పల్లవి
నేరములెంచని వాడా - నాదు నజరేయుడా తీరము దాటిన వాడా - నాదు గలలీయుడా నాప్రాణ నాధుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీవాడనో యేసువా "ఏరీతి "
1వ చరణం
వెదకినను, ఇల చేరితివి - వెంబడించగ పిలచితివి రోత బ్రతుకును మార్చితివి - నీదు సుతునిగ జేసితివి "నాప్రాణ"
2వ చరణం
మహిమ నగరిని విడిచితివి - మంటి దేహము దాల్చితివి సకల సంపద విడిచితివి - సేవకునిగా మారితివి "నాప్రాణ"
3వ చరణం
ఇంత ప్రేమకు కారణము - ఎరుగనైతిని నా ప్రభువా ఎన్నతరమా నీ ప్రేమ - సన్నుతించుచు సాగెదను "నాప్రాణ"