ఈ సాయంకాలమున – యేసు
ee saayankaalamuna – yeesu
🎵 TG-2381🌐 Telugu
పల్లవి
ఈ సాయంకాలమున – యేసు ప్రభో వేడెదము నీ సుదయారస మొల్క – నిత్యంబు మముగావు ||ఈ సాయంకాలమున||
1వ చరణం
చెడ్డ కలల్ రాకుండ – నడ్డగించుమి ప్రభో బిడ్డలము రాత్రిలో – భీతి బాపుము తండ్రీ దుష్టుండౌ శోధకుని – ద్రోక్కుటకు బలమిమ్ము భ్రష్టత్వమున మేము – పడకుండ గాపాడు నీ యేక పుత్రుండౌ – శ్రీయేసు నామమున సాయం ప్రార్థన లెల్ల – సరగ నాలించుమా జనక సుత శుద్ధాత్మ – ఘన దేవా స్తుతియింతుం అనిశము జీవించి – రా – జ్యంబు జేయు మామేన్