ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి

ekkadekkadoo putti ekkadekkadoo perigi

🎵 TG-1855🌐 Telugu
పల్లవి

ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి (2) చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలోని చిత్రం – ఒంటరి బ్రతుకును విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లి దండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో ||దేవుని||

1వ చరణం

గత కాల కీడంతా మరచెదరు వీనులతో సంతసించెదరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో ఫలియించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో

Report Error