ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను
elaa maruvagalanayyaa nee preemanu
🎵 TG-1720🌐 Telugu
పల్లవి
ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను ఎలా విడువగలనయ్యా నీ సేవను (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఎలా మరువగలనయ్యా||
1వ చరణం
ఆత్మీయులే నన్ను ఆదరించలేదు ప్రేమించువారే ప్రేమించలేదు ఆదరించావు ప్రేమించావు అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు బంధువులే నన్ను ద్వేషించినారు సొంత తల్లిదండ్రులే వెలివేసినారు చేరదీసావు సేదదీర్చావు అనాథగా నేను తిరుగుచున్నప్పుడు ఆకలితో నేను అలమటించినప్పుడు ఆదరించావు ఆకలి తీర్చావు