పల్లవి
నిద్రించుచున్న సోదరులారా యేసయ్య స్వరమును వినండి ప్రభు చెంత చేరండి జీవాన్ని పొందండి
1వ చరణం
మట్టితో నిన్ను చేసెను జీవాత్మ నీలో పోసెను తన రూపు నీకిచ్చెను మహిమతో నిన్ను నింపెను యేసయ్య నిన్ను పిలువగా సిగ్గుతో పరుగిడనేల ||ఎండి||
2వ చరణం
సొంత దొడ్డి మరిచావు మరణమార్గమును నీవు కోరావు జీవాహారము లేక నీవు జీవచ్ఛవమై యున్నావు యేసయ్య నిన్ను చూడగా ఎండిపోయి మిగిలావు ||ఎండి||
3వ చరణం
జీవాధిపతి నిన్ను ప్రేమతో పిలచుచుండెను నూతన సృష్టి చేయ తన కరములు చాపియుండె ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయకుమా ||ఎండి||