ఎందుకో...నన్నింతగా నీవు - ప్రేమించితివో దేవా
endukoo...nanninthagaa neevu - preeminchithivoo deevaa
ఎందుకో...నన్నింతగా నీవు - ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర - హల్లేలూయ యేసయ్యా (2)
నా పాపము బాప నర రూపివైనావు - నా శాపము బాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే (2) ||ఎందుకో...నన్నింతగా నీవు||
నీ రూపము నాలో నిర్మించి యున్నావు – నీ పోలికలోనే నివశించమన్నావు నీవు నన్ను ఎన్నుకొన్నావు - నీ కొరకై నీకృపలో (2) ||ఎందుకో...నన్నింతగా నీవు||
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు – నా వ్యధలుభరించి నన్నాదుకొన్నావు నన్ను నీలో చేర్చుకొన్నావు - నను దాచియున్నావు (2) ||ఎందుకో...నన్నింతగా నీవు||
నా మనవులు ముందే నీమనసులో నెరవేరే – నా మనుగడముందే నీగ్రంధములో నుండే యేమి అద్భుత ప్రేమ సంకల్పం - నేనేమి చెల్లింతు (2) ||ఎందుకో...నన్నింతగా నీవు||
నీ చేతులతోనే నన్ను చేసి యున్నావు – నీ గాయములోనే నను దాచి యున్నావు నీదు సేవను చేయుచున్నాను - నీ కొరకై జీవింతున్ ||ఎందుకో...నన్నింతగా నీవు||