♪♫
TG-4762
Telugu
ఎన్నఁడు గాంచెదమో యేసుని నెన్నఁడు
Ennandu Gaanchedamoo Yeesuni Nennandu
0
views
పల్లవి
ఎన్నఁడు గాంచెదమో యేసుని నెన్నఁడు గాంచెదమో యెన్నఁడు జూతుము కన్నె కుమారుని సన్నుతి జేయుచును ||ఎన్నఁడు||
1వ చరణం
1. అంధుల గాచె నఁట యెహోవా నందనుఁ డితఁడౌనట పొందుగఁ బాపాత్ములకొర కై తన ప్రాణము విడిచెనఁట ||ఎన్నఁడు||
2వ చరణం
2. వేసిరి సిలువనఁట క్రీస్తుని జేసిరి హేళనఁట డాసిరి యూదులఁట బల్లెము దూసిరి ప్రక్కనఁట ||ఎన్నఁడు||
3వ చరణం
3. చిందెను రక్తమఁట పరమ సంధులు దెల్పెనఁట నిందల కోర్చె నఁ ట మన దగు నేరము గాచెనఁట ||ఎన్నఁడు||
4వ చరణం
4. ఆపద కోర్చెనఁట పాపపు మోపులు మోసెనఁట కోపము మాన్పెనఁ ట యెహోవా కొడుకై వెలసెనఁట ||ఎన్నఁడు||
5వ చరణం
5. అక్షయుఁ డితఁడెనఁట జగతికి రక్షకుఁ డాయెనఁట దీక్షగ నమ్మిన నరులం దరికి ని రీక్షణ దేవుఁడఁట ||ఎన్నఁడు||