ఎన్ని తలచినా ఏది అడిగినా

enni thalachinaa eedi adiginaa

🎵 TG-2802🌐 Telugu
పల్లవి

ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు అడవి పూవులే నీ ప్రేమ పొందగా ||ఎన్ని||

1వ చరణం

నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి లోకమంతయూ నన్ను విడచినా నీ నుండి వేరు చెయ్యవు నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి నీదు యాగమే నా మోక్ష మార్గము నీయందే నిత్యజీవము

Report Error