పల్లవి
ఎంత మధురము నా యేసుని ప్రేమ.. ప్రేమా....ప్రేమా.....ప్రేమా.....ప్రేమా....
1వ చరణం
అందకార బంధము నన్నావరించగా - అందుడనై యేసయ్యను ఎరుగకుంటిని (బంధము తెంచెను - బ్రతికించెను నన్ను) "ఎంత"
2వ చరణం
రక్షించువారు లేక పక్షినైతిని – భక్షకుడు భాణము గురి పెట్టియుండెను "బంధము"
3వ చరణం
ఎన్నో పాపములు చేసి మూటకడితినీ – ఎన్నో దోషములు చేసి దోసినైతిని "బంధము"
4వ చరణం
కుష్టు బ్రతుకుతో నేను కృంగియుండగా – బ్రష్టుడనైన నన్ను బ్రతికించితివి "బంధము"