పల్లవి
చింతలన్ని తీరనయ్యా నిన్నుచేరగా - ఎంతమంచిదేవుడ వేసయ్యా నా చింతలన్ని తీరనయ్యా నిన్నుచేరగా - ఎంతమంచిదేవుడ వేసయ్యా
1వ చరణం
గోరపాపినైన నేనూ – నీకు దూరంగా పారిపోగ “2” నీప్రేమతో నన్ను క్షమియించీ – నన్ను హత్తుకొన్నావేసయ్యా “2”
2వ చరణం
నాకున్నవారందరూ – నన్ను విడచిపోయిననూ “2” నన్నెంతోఇబ్బందులకు గురిచేసినా –నన్ను నీవు విడువలేదయ్యా“2”
3వ చరణం
నీవు లేకుండ నేనూ – ఈలోకంలో బ్రతుకలేనయ్యా “2” నీతో కూడా ఈలోకం నుండీ – పరలోకం చేరెదనేసయ్యా “2”