ఎంత దూరమైనా అది ఎంత
entha duuramainaa adi entha
🎵 TG-2236🌐 Telugu
పల్లవి
ఎంత దూరమైనా అది ఎంత భారమైనా (2) యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు (2) ||ఎంత||
1వ చరణం
నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా కలువరి గిరి దనుక సిలువ మోసిన నజరేయుడేసు నీ ముందు నడవగా (2) ||యేసు||
2వ చరణం
తెలిసి తెలిసి జారిపోయినావా తెలియరాని చీకటిలో చిక్కుబడినావా నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా