ఎంత దూరమైనా అది ఎంత భారమైన

entha duuramainaa adi entha bhaaramaina

🎵 TG-1263🌐 Telugu
పల్లవి

ఎంత దూరమైనా అది ఎంత భారమైన యేసు వైపు చూడు నీ భారమంత తీరు తీరానికి చేరు

1వ చరణం

నడచి నడచి అలసిపోయినావా నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా కలువరి గిరి దనుక సిలువ మోసిన నజరేయుడేసు నీ ముందు నడవగా ||యేసు||

2వ చరణం

తెలిసి తెలిసి జారిపోయినావా తెలియరాని చీకటిలో చిక్కుబడినావా నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా ||యేసు||

Report Error