ఎంత మంచి దేవుడవయ్యా ఎంత
entha manchi deevudavayyaa entha
🎵 TG-2122🌐 Telugu
పల్లవి
ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా (2) ||ఎంత||
1వ చరణం
ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా (2) నీ ప్రేమతో నను క్షమియించి నను హత్తుకొన్నావయ్యా ||ఎంత||
2వ చరణం
నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ నను నీవు విడువలేదయ్యా నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా నీతో కూడా ఈ లోకం నుండీ పరలోకం చేరెదనేసయ్యా (2) ||ఎంత||