ఎంతటి వాడను నేను యేసయ్యా
enthati vaadanu neenu yeesayyaa
🎵 TG-1372🌐 Telugu
పల్లవి
ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైనా యోగ్యుడను కానయ్యా (2) ఇంతగ నను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు (2) ||ఎంతటి||
1వ చరణం
ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవీవే హెచ్చించువాడవును బలమిచ్చువాడవు నీవే అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు ||ఎంతటి||
2వ చరణం
నిను వెంబడించువారిని నిజముగ సేవించువారిని నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని ఎంతో ఘనపరచెదవు ఆశీర్వదించెదవు శత్రువుల కంటె ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు వినయముగల మనుష్యులను వర్దిల్లజేసెదవు గర్విష్టుల గర్వమునణచి గద్దె నుండి దించెదవు మాదు ఆశ్రయ దుర్గమా మేమంతా నీ వారమే మా శైలము మా కేడెమా మాకున్నదంతా నీ దానమే