TG-597
Telugu

ఎంతో ఘనమగువారలు పరిశుద్ధులు ఎంతో

enthoo ghanamaguvaaralu parishuddhulu enthoo

206
views
పల్లవి

ఎంతో ఘనమగువారలు పరిశుద్ధులు ఎంతో వినదగువారలు సంతసంబుగ వార త్యంత ప్రేరణతోడ సొంతవారిని సహా సొంతంబుగ విడచి చెంతజేరిరి యేసు ప్రభుని చింతలేకను వెంబడించి వింత పనులను జేసి బ్రతికిరి అంతమువరకును నడచిరి ||ఎంతో ఘనమగువారలు||

1వ చరణం

పేతు రపోస్తలుండు అతని సోదరు డతి ప్రియు డంద్రెయయు నీతి నియమములందు ప్రీతితో బ్రదుకుచు చేతి పనులయందు శ్రద్ధతో నుండుచు ఖ్యాతి నొందిన యోహాను అతని యన్న యాకోబుతోను ప్రతి దినంబును కలిసి యుండుచు భక్తి ప్రభువును వెంబడించిరి ||ఎంతో ఘనమగువారలు||

2వ చరణం

ఆస్తి నిచ్చిన బర్నబా ఆస్తిపరుడ పోసలులతో జేరెన్ స్వస్థబుద్ధి తోడ ఆస్తివాడుట యెట్లో క్రీస్తు సేవకొరకు ఖర్చుపెట్టుట యెట్లో వాస్తవముగ నేర్పినాడు ఆస్తిగలవారలకు నెల్ల ప్రస్తుతంపు ఆస్తిపాస్తులు ప్రభువు పనికియ్యవలెనని ||ఎంతో ఘనమగువారలు||

3వ చరణం

సంఘమును హింసించిన సంఘాభిమాని సంఘ నాయకుడు పౌలు సంఘముల నెన్నటినో చక్కగను స్థాపించి సంఘముల కుత్తరముల్ సమయానుకులముగ సంఘ కాపరులకును సహా సరియగు సలహాల నిచ్చి సంఘములను ప్రభువు కొరకై స్థాపించి నిలుపలేదా ||ఎంతో ఘనమగువారలు||

4వ చరణం

కన్యయైన మరియమ్మ ధన్యురాలు కన్యలకు తల్లులకున్ను అన్యులకు అందరికి ఆదర్శముగ నుండ సన్యాసిను లెందరో స్వామిని సేవించ కన్యకలుగ నిలుచువారలు కఠినవ్రతములతోడ నుండి ధన్యులగు పరిశుద్ధులతో దైవసన్నిధి నుండ జూపెను ||ఎంతో ఘనమగువారలు||

5వ చరణం

మగదాలయూరి మరియ మహినినున్న మగువలలో కెల్లను భగవంతుడై నట్టి ప్రభువు యేసునుజేరి నగము నెక్కెను తన సొగసైన మార్పుచే సాగి మొదట సమాధికడకు స్వామిదర్శనమొంది మొదట వేగవెళ్లి శిష్యులకును వెదకి సాక్ష్యమియ్యలేదా ||ఎంతో ఘనమగువారలు||

6వ చరణం

మత్తయి మార్కులను వారు మతమునందు అతినిష్టగలవారలు మత్తయి యూదులకై తన పుస్తకమును వ్రాసె మార్కు గూడను తన సు వార్తనందరి కిచ్చె వాస్తవంపు జీవితమును వరుసగాను గలిగియుండ క్రీస్తు ప్రభువును వెంబడించగ క్రొత్తలోకము జూపగలిగిరి ||ఎంతో ఘనమగువారలు||

7వ చరణం

చూచననేగాని నమ్మనని పేచిపెట్టి నతోమయు చాచి చేయి చూచి చక్కగ నమ్మెను చూడకుండనె లూక వైద్యుండు నమ్మెను యీ చొప్పున వీరలిద్దరు నీచజనులకెల్లరకు తము బ్రోచు ప్రభువును జూపుచుందురు బ్రోదిగా ప్రతిదినమునందును ||ఎంతో ఘనమగువారలు||

8వ చరణం

ప్రభువా నీ పరిశుద్ధుల బ్రతుకునందు మా భాగ్యమునున్నదిహా ప్రభువా వారి బ్రదుకు ప్రబలమైన సేవ విభవంగాగని విజయంబు గాంచుచు వారితో నేలునట్లు యభయమియ్యు మాకు దేవా ||ఎంతో ఘనమగువారలు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.