ఎటు చూచినా యుద్ధ సమాచారాలు
ettu chuuchinaa yuddha samaachaaraalu
పల్లవి
ఎటు చూచినా కరువు భూకంపాలు ఎటు చూచినా దోపిడి దౌర్జన్యాలు ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు ఓ సోదరా సోదరీ రాకడ గురుతులని తెలుసుకో తినుటకు త్రాగుటకు ఇది సమయమా
1వ చరణం
మందసం ఈ ప్రజలు గుడారములో నివసిస్తుండగా యోవాబు నీ సేవకులు దండులో ఉండగను తినుటకు త్రాగుటకు భార్య తో ఉండుటకు ఇది సమయమా ఇది సమయమా అని ఆనాడు ఊరియా దావీదు నడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు||
2వ చరణం
నా పితరులు యొక్క సమాధులుండు పట్టణము పాడైపోయెను పాడైపోయెను యెరుషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా సంతోషముగా ఉండుటకు ఇది సమయమా అని ఆనాడు నెహమ్యా ఫరో రాజునడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు||