ఎటు చూచినా యుద్ధ సమాచారాలు

etu chuuchinaa yuddha samaachaaraalu

🎵 TG-1317🌐 Telugu
పల్లవి

ఎటు చూచినా యుద్ధ సమాచారాలు ఎటు చూచినా కరువు భూకంపాలు ఎటు చూచినా దోపిడి దౌర్జన్యాలు ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు ఓ సోదరా సోదరీ రాకడ గురుతులని తెలుసుకో తినుటకు త్రాగుటకు ఇది సమయమా

1వ చరణం

మందసం ఈ ప్రజలు గుడారములో నివసిస్తుండగా యోవాబు నీ సేవకులు దండులో ఉండగను తినుటకు త్రాగుటకు భార్య తో ఉండుటకు ఇది సమయమా ఇది సమయమా అని ఆనాడు ఊరియా దావీదు నడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు||

2వ చరణం

నా పితరులు యొక్క సమాధులుండు పట్టణము పాడైపోయెను పాడైపోయెను యెరుషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా సంతోషముగా ఉండుటకు ఇది సమయమా అని ఆనాడు నెహమ్యా ఫరో రాజునడిగాడు ఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు ||ఎటు||

Report Error