గాడాంధకారపు లోయలో నే సంచరించిన
gaadaandhakaarapu looyaloo nee sancharinchina
🎵 TG-1795🌐 Telugu
పల్లవి
గాడాంధకారపు లోయలో నే సంచరించిన వేళలో అపాయమేమియు రానీయక ఉన్నావు తోడుగ నా త్రోవలో (2) యేసయ్య నీవే మా కాపరివి ఏమి లేమి లేక కాపాడితివి నా ఆశ్రయ దుర్గము నీవే నా బలమైన శైలము నీవే నా రక్షణ శృంగము నీవే నా శిక్షను భరియించితివే ||గాడాంధకారపు||
1వ చరణం
పచ్చిక గల చోట్లలో నిలిపావు శాంతి జలములందు నన్ను నడిపావు నా ఎత్తైన కోట నీవే నే నడిచే ప్రతి చోట నీవే నా రక్షణకర్తా నీవే నా జీవన దాతా నీవే ||గాఢాంధకారపు||
2వ చరణం
నూనెతో నా తలను అంటావు నా గిన్నెను పొర్లి పారజేసావు నా మొరను ఆలించావే నీ వరములు నాకొసగావే నా పరమ తండ్రివి నీవే నీ కరమున నను దాచావే చీకటి బ్రతుకును వెలిగించావు మరణపు భయమును తొలగించావు నా త్రోవకు వెలుగు నీవే నా నావకు చుక్కాని నీవే నను కావగ ఏతెంచితివే కొనిపోవగ రానున్నావే