గాఢాంధకారములో - నేను తిరిగినను

gaaddhaandhakaaramuloo - neenu tiriginanu

🎵 TG-1321💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

నేనేల భయపడుదు- నా తోడు నీవుండగా

1వ చరణం

ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టిననూ నిన్ను తలచినచో అన్ని విడనాడు (2) అన్ని కాలముల నిన్నే స్మరియింతు (2) ఎన్నరానివయా నీకున్న సుగుణములు ||గాఢాంధ||

2వ చరణం

నాకున్న మనుజులెల్ల - నిన్ను విడిచిననూ నా దేవ ఎప్పుడైనా - నన్ను విడిచితివా (2) నా హృదయ కలశమున - నిను నేను నిలిపెదను (2) నీ పాద కమలముల - నా దేవ కొలిచెదను. ||గాఢాంధ||

3వ చరణం

నా బ్రతుకు దినములలో నిన్నేల మరచెదను నీ ఘన కార్యముల నేనెపుడు స్మరియింతు (2) నీ ఉపకారముల నేనెపుడు తలచెదను (2) నా యేసు పాదముల నేనిపుడు కొలిచెదను. ||గాఢాంధ||

Report Error