గాయపడిన నీ చేయి చాపుము
gaayapadina nee cheeyi chaapumu
🎵 TG-2586🌐 Telugu
పల్లవి
గాయపడిన నీ చేయి చాపుము దేవా నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా (2) సిలువే నాకు విలువైనది అదియే నా బ్రతుకున గమ్యమైనది ఎంతో రమ్యమైనది ||గాయపడిన||
1వ చరణం
ఎండిన భూమిలో మొలచిన లేత మొక్క వలె నీవు ఎదిగితివి సురూపమైనా ఏ సొగసైనా లేనివానిగా నాకై మారితివి మనుషులందరు చూడనొల్లని రూపముగా నాకై మారితివి మా రోగములు మా వ్యసనములు నిశ్చయముగా నీవు భరియించితివి నీవు పొందిన దెబ్బల వలన స్వస్థత నాకు కలిగినది నీవు కార్చిన రక్తమే మా అందరికీ ఇల ప్రాణాధారము