గడిచిన కాలమంతా – నను

gadichina kaalamanthaa – nanu

🎵 TG-1707🌐 Telugu
పల్లవి

గడిచిన కాలమంతా – నను నడిపిన నా దేవా నీ కంటి పాప లాగా – కాపాడిన నా ప్రభువా (2) మరో యేడు నాకొసగినందుకు – నీకేమి నే చెల్లింతును నీ ప్రేమను పంచినందుకు – నిన్నేమని కీర్తింతును (2)        ||గడిచిన||

1వ చరణం

ఇచ్చిన వాగ్ధానం మరువక – నిలుపు దేవుడవు శూన్యమందైనా సకలం – సాధ్యపరచెదవు నా మేలు కోరి నీ ప్రేమతో – నను దండించితివి చెలరేగుతున్న డంభమును – నిర్మూలపరచితివి (2)        ||మరో యేడు||

2వ చరణం

నాదు కష్ట కాలములోన – కంట నీరు రాకుండా నాదు ఇరుకు దారుల్లోన – నేను అలసిపోకుండా నా సిలువ భారం తగ్గించి – నీవేగా మోసితివి నీ ప్రేమతో పోషించి – సత్తువ నింపితివి

Report Error