గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని

gaganamu cheelchukoni ghanulanu theesukoni

🎵 TG-1629🌐 Telugu
పల్లవి

గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని నన్ను కొనిపోవ రానైయున్న ప్రాణప్రియుడా యేసయ్యా (2) నిన్ను చూడాలని… నా హృదయమెంతో ఉల్లసించుచున్నది ఉల్లసించుచున్నది… ||గగనము||

1వ చరణం

నీ దయా సంకల్పమే – నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది పవిత్రురాలైన కన్యకగా – నీ యెదుట నేను నిలిచెదను నీ కౌగిలిలో నేను విశ్రమింతును (2)          ||గగనము||

2వ చరణం

నీ మహిమైశ్వర్యమే – జ్ఞాన సంపదనిచ్చినది మర్మమైయున్న నీవలె రూపించుచున్నది కళంకములేని వధువునై – నిరీక్షణతో నిన్ను చేరెదను యుగయుగాలు నీతో ఏలెదను నీ కృపా బాహుళ్యమే – ఐశ్వర్యమునిచ్చినది తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది అక్షయమైన దేహముతో – అనాది ప్రణాళికతో సీయోనులో నీతో నేనుందును

Report Error