గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము ఆ ఆ

geetham geetham jaya jaya geetham cheeyi thatti paadedamu aa aa

🎵 TG-1055🌐 Telugu
పల్లవి

గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము ఆ ఆ యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము

1వ చరణం

చూడు సమాధిని మూసినరాయి - దొరలుచు పొరలిడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెన- దైవ సుతుని ముందు ||గీతం||

2వ చరణం

వలదు వలదు ఏడవ వలదు - పరుగిడి ప్రకటించుడి తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - వెళ్ళుడి గలిలయకు ||గీతం||

3వ చరణం

అన్న కయప వారల సభయును అదురుచు పరుగిడిరి అందు దూత గణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి ||గీతం||

4వ చరణం

గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి - జయ వీరుడు రాగా మీ మేళ తాల బూర వాద్యముల్ - లెత్తి ధ్వనించుడి ||గీతం||

Report Error