గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము ఆ ఆ
giitan giitan jaya jaya giitan cheeyi tatttti paaddedamu aa aa
పల్లవి
యేసు రాజు గెల్చెను హల్లెలూయ జయ మార్భటించెదము
1వ చరణం
చూడు సమాధిని మూసినరాయి - దొరలుచు పొరలిడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెన- దైవ సుతుని ముందు “గీతం”
2వ చరణం
వలదు వలదు ఏడవ వలదు - పరుగిడి ప్రకటించుడి తాను చెప్పిన విధమున తిరిగి లేచెను - వెళ్ళుడి గలిలయకు “గీతం”
3వ చరణం
అన్న కయప వారల సభయును అదురుచు పరుగిడిరి అందు దూత గణముల ధ్వనిని వినుచు - వణకుచు భయపడిరి “గీతం”
4వ చరణం
గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి - జయ వీరుడు రాగా మీ మేళ తాల బూర వాద్యముల్ - లెత్తి ధ్వనించుడి “గీతం”