గూడు లేని గువ్వలా దారి
guudu leeni guvvalaa daari
🎵 TG-2508🌐 Telugu
పల్లవి
గూడు లేని గువ్వలా దారి తప్పితి గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2) నీ గుండెలో దాచుమా నీ గూటికే చేర్చుమా నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా ||గూడు||
1వ చరణం
గువ్వలకు గూళ్ళిష్టం – కోయిలకు పాటిష్ఠం నాకేమో నువ్విష్టం – నీ సన్నిధి ఇష్టం నువ్వంటే ఇష్టం యేసయ్యా నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2) ||నా ప్రాణమా||
2వ చరణం
చేపలకు నీళ్ళిష్టం – పిల్లలకు తల్లిష్టం నీకేమో చెలిమిష్టం – నా స్నేహం ఎంతో ఇష్టం నేనంటే నీకెంతో ఇష్టమయ్యా నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా