గూడు లేని గువ్వనై

guudu leeni guvvanai

🎵 TG-2459🌐 Telugu
పల్లవి

గూడు లేని గువ్వనై – కూడు లేని బిడ్డనై (2) నీడ లేని మనిషినై – అందరిలో ఒంటరినై దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నాను సహాయము కొరకు ఆర్జిస్తు ఉన్నాను అప్పుడొక మెల్లని స్వరము నాతో మాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను నా జీవితమంత ప్రకాశింప సాగింది (2)         ||గూడు||

1వ చరణం

అప్పుడొక తియ్యని స్వరము నాతో మాట్లాడి చెప్పెను ప్రియుడైన యేసుని నా పాప జీవితము పారిపో సాగింది (2)       ||గూడు||

2వ చరణం

అప్పుడొక అద్భుత స్వరము నాతో మాట్లాడి చెప్పెను రాజైన యేసుని నా ప్రశ్నలన్నిటికి జవాబులు దొరికాయి గూడు ఉన్న గువ్వనై – కూడు ఉన్న బిడ్డనై నీడ ఉన్న మనిషినై – ఒక్కరిలో వెయ్యినై దారి తెలిసిన స్థితిలో నిలబడి ఉన్నాను సేవలోని మాధుర్యము ననుభవిస్తున్నాను యేసుని నమ్ముకో – యేసుని చేరుకో యేసుని కోరుకో – యేసుతో చేరిపో (4)

Report Error