హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను
halleluyaa paadedaa prabhu ninnu
🎵 TG-2839🌐 Telugu
పల్లవి
హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2) అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
1వ చరణం
వాగ్ధానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే ఎందరు నిను చూచిరో వారికి వెలుగు కల్గెన్ ప్రభువా నీ వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే కష్టములన్నింటిని ప్రియముగా భరియింతును నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే