హే ప్రభుయేసు హే ప్రభుయేసు
hee prabhuyeesu hee prabhuyeesu
హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా – పాపహరా – శాంతికరా ||హే ప్రభు||
శాంతి సమాధానాధిపతీ స్వాంతములో ప్రశాంతనిధీ (2) శాంతి స్వరూపా జీవనదీపా శాంతి సువార్తనిధీ ||సిల్వధరా||
తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెగదా విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవెగదా మతములు వెదకిన నిన్నెకదా వ్రతములుగోరిన నిన్నెగదా పతితులు దేవుని సుతులని నేర్పిన హితమతి వీవెగదా పలుకులలో నీ శాంతికధ తొలకరి వానగా కురిసెగదా మలమల మాడిన మానవ హృదయము కలకలలాడె కదా కాననతుల్య సమాజములో హీనత జెందెను మానవత మానవ మైత్రిని సిల్వ పతాకము దానము జేసెగదా ||సిల్వ ధరా||
దేవుని బాసిన లోకములో చావుయే కాపురముండె గదా దేవునితో సఖ్యంబును జగతికి యీవి నిడితివి గదా పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండె గదా దాపున జేరి పాపిని బ్రోచిన కాపరి వీవెగదా ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగ జేసిన నీవే గదా ఖలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయె గదా కలువరిలో నీ శాంతి సుధా సెలయేరుగ బ్రవహించె గదా కలుష ఎడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా