హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా

hee prabhuyeesu hee prabhuyeesu hee prabhu deevasuthaa

🎵 TG-1260🌐 Telugu
పల్లవి

హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా - పాపహరా - శాంతికరా ||హే ప్రభు||

1వ చరణం

శాంతి సమాధానాధిపతీ - స్వాంతములో ప్రశాంతనిధి శాంతిస్వరూప జీవనదీపా - శాంతి సువార్తనిధీ ||సిల్వ||

2వ చరణం

తపములు తరచిన నిన్నేకదా - జపములు గొలిచిన నిన్నేగదా విఫలులు చేసిన విజ్ఞాపనలకు -సఫలత నీవెకదా ||సిల్వ||

3వ చరణం

మతములు వెదకిన నిన్నేకదా - వ్రతములుగోరిన నిన్నేగదా పతితులు దేవుని సుతులని నేర్పిన - హితమతి నీవెగదా ||సిల్వ||

4వ చరణం

పలుకులలో నీ శాంతికధ - తొలకరి వానగా కురిసెగదా మలమల మాడిన మానవ హృదయము- కలకల లాడెగదా ||సిల్వ||

Report Error