హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు

hoosannanuchuu sthuthi paaduchuu seeyoonuku

🎵 TG-2879🌐 Telugu
పల్లవి

హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం (2) హోసన్నా… హోసన్నా… (4)           ||హోసన్ననుచూ||

1వ చరణం

ఈ లోకయాత్రలో బాటసారులం ఈ జీవన కడలిలో పరదేశులం క్షణభంగురం ఈ క్షయ జీవితం అక్షయ నగరం మనకు శాశ్వతం (2)        ||హోసన్నా||

2వ చరణం

మన్నయిన ఈ దేహం మహిమరూపమై ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము నాధుడేసుకు నవ వధువులము నీతి పాలనలోన యువరాణులము (2)           ||హోసన్నా||

3వ చరణం

ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును చింతలన్ని తీర్చి చెంత నిలుచును ఆకలి లేదు దప్పిక లేదు ఆహా మన యేసుతో నిత్యమానందం (2)          ||హోసన్నా||

Report Error