ఇదే నా హృదయ వాంఛన

idee naa hrudaya vaanchhana

🎵 TG-2657🌐 Telugu
పల్లవి

ఇదే నా హృదయ వాంఛన నీవే నా హృదయ స్పందన (2) నిన్ను చూడాలని – నిన్ను చేరాలని నా బ్రతుకు నీలో నే సాగని ||ఇదే నా||

1వ చరణం

నీ యందు నిలిచి ఫలియించాలని నీ అడుగు జాడలోనే నడవాలని ఈ లోక ఆశలన్ని విడవాలని నీ సువార్తను ఇలలో చాటాలని ఆశతో నీ కొరకై నే వేచియుంటిని – యేసయ్యా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా నీకన్నా ఈ లోకాన నాకెవరున్నారయ్యా (2)      ||ఇదే నా||

2వ చరణం

ప్రతి వారు నీవైపు తిరగాలని ప్రతి వారి మోకాలు వంగాలని ప్రతి నాలుక నిన్నే స్తుతియించాలని ప్రతి ఆత్మ ప్రార్ధనలో నిండాలని ప్రతి చోట నీ పాట పాడాలని ప్రతి చోట నీ సువార్త చేరాలని ప్రతి వారికి రక్షణ కావాలని ప్రతి వారు నీ సన్నిధి చేరాలని

Report Error