ఇదిగో దేవుని గొర్రెపిల్ల - ఇవేగా మా కృతాజ్ఞత స్తుతులు

idigoo deevuni gorrepilla - iveegaa maa krutaajnyata stutulu

🎵 TG-1024💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

అర్హుడవు అర్హుడవు గొర్రెపిల్లా - నీవేయోగ్యుడవు రక్తమిచ్చి, ప్రాణమిచ్చి - నీదు ప్రజలను కొనినావు అర్హుడవు అర్హుడవు గొర్రెపిల్లా - నీవేయోగ్యుడవు మహిమయు, ఘనతయు - నీకే చెల్లును ఎల్లప్పుడు "ఇదిగో"

1వ చరణం

పాపమునంతా పోగొట్టి - ప్రాచీన స్వభావము తొలగించి సిలువ శక్తితోనే - నూతన జీవులుగా మార్చెను ఆ.. " అర్హుడవు "

2వ చరణం

దేవుని ప్రేమ విస్తరింపగా - కృపావరమునే దానముగా యేసుక్రీస్తులోనే - నీతిమంతులుగా మార్చెను ఆ.. " అర్హుడవు "

3వ చరణం

దేవునికి ఒక రాజ్యముగా - యాజకులనుగా చేసితిని క్రీస్తుతో రాజ్యమేలగ - జయించు వానిగా మార్చును ఆ.. " అర్హుడవు "

Report Error