ఇదిగో దేవుని గొర్రెపిల్లా ఇవేగా

idigoo deevuni gorrepillaa iveegaa

🎵 TG-2399🌐 Telugu
పల్లవి

ఇదిగో దేవుని గొర్రెపిల్లా ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు (2) అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు రక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు మహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు ||ఇదిగో||

1వ చరణం

పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి సిలువ శక్తితోనే – నూతన జీవులుగా మార్చెను ||అర్హుడవు||

2వ చరణం

దేవుని ప్రేమ విస్తరింపగా – కృపావరమునే దానముగా యేసుక్రీస్తులోనే – నీతిమంతులుగా మార్చెను దేవునికి ఒక రాజ్యముగా – యాజకులనుగా చేసితివి క్రీస్తుతో రాజ్యమేలగ – జయించు వానిగా మార్చెను

Report Error