ఈ జీవిత ఈత

ee jeevita eeta

🎵 TG-1270💿 Telugu Christian Songs🌐 Telugu
1వ చరణం

సారహీనపు సంసారాబ్దిలోన సాగలేకున్నాను సాయంబు రావా సార కరుణా రసధారల్ నొసగుము సాగిపోవను ముందుకు శక్తిని నాకిమ్ము ||ఈ జీవిత ||

2వ చరణం

సంఘ సంబంధముగ శాంతి లేకపోయె - సమానతత్వంబు సమసిపోయే - సోదరులే నాకు శత్రువులైరి - సమాధానము నొసగు సరుగున రావా దేవా ||ఈ||

3వ చరణం

బయట పోరాటములు భయపెట్టుచుండెను భార్యా పుత్రాదులచే బాధలేన్నో కలిగే బాధలన్నియు బాయ బహు త్వరగా రావా ||ఈ జీవిత ||

4వ చరణం

రాజ్యంబు పై రాజ్యంబు రంకె వేయుచుండే - రాష్ట్రము పై రాష్ట్రంబు రగులుచుండె - రాజులకు రాజువై రయముగ రావయ్యా - రాజ్యమేలను త్వరలో రమ్ము రమ్ము ||ఈ జీవిత ||

5వ చరణం

సైతాను చెలరేగే సమయంబిక లేదని సింహంబు రీతి గర్జించుచుండె - సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి సమాధాన రాజ్యం స్థాపింప రావా ||ఈ||

6వ చరణం

మొదటి జామయ్యెను మీరింక రారయ్యే - రెండవ జామున జాడలేదే - మూడవ జామయ్యే మీరింక రాలేదే - నాల్గవ జామున నడిచి వస్తున్నావా ||ఈ||

7వ చరణం

పెండ్లి కుమారుడు ప్రభువైన క్రీస్తుండు పెండ్లి సంఘం ఆత్మయు పిలచుచుండెను - పెండ్లి విందులో నేను పెండ్లి వస్త్రముతోను హల్లెలూయ యని పాడెదను ||ఈ జీవిత ||

Report Error