ఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద

ishraayeelu deevaa naa sthuthulameeda

🎵 TG-2742🌐 Telugu
పల్లవి

ఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద ఆసీనుడా నిరంతరము స్తోత్రములకు పూజార్హుడా (2) ఏమని నిన్ను నేను కీర్తింతును ఏమని నిన్ను నేను పూజింతును ఏమని నిన్ను నేను ఆరాధింతును ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకు ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా ||ఇశ్రాయేలు||

1వ చరణం

నా పితరులెందరో నిన్ను ఘనపరచి దహనబలులు నీకు అర్పించగా ఇంపైన సువాసనగా అంగీకరించి దీవెన వర్షము కురిపించితివే (2)      ||ఆరాధనా||

2వ చరణం

నా హృదయ క్షేత్రములో నిన్నారాధించి స్తుతుల సింహాసనము నీకు వేయగా ఆనంద తైలముతో నన్నభిషేకించి స్తోత్రగీతముతో నన్ను నింపితివే నా కొరకు సీయోనును సిద్ధపరచి మహిమతో తిరిగి రానైయుంటివే ఆనంద ధ్వనులతో నన్నూరేగించి శాశ్వత జీవము నాకిచ్చితివే

Report Error