ఇసుక మీద ఇల్లు కట్టకు

isuka meeda illu kattaku

🎵 TG-2339🌐 Telugu
పల్లవి

ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది (2) వాన కురిసి వరద వస్తే గాలి తోడై విసిరి కొడితే మాట వినని వాని ఇల్లు కూలిపోయెను లోబడని వాని ఇల్లు కూలిపోయెను వాని సొగసైన ఇల్లు కూలిపోయెను మాట వినిన వాని ఇల్లు నీటుగుండెను లోబడిన వాని ఇల్లు నీటుగుండెను వాని సొగసైన ఇల్లు నిలిచియుండెను జోరు వాన హోరు గాలి వరద పోటు ఆ ఇంట ముంగిట తెల్లబోయెగా బండ మీద ఇల్లు కట్టి సాటి ఏదని చాటి చెప్పి బండ అయిన యేసు మీద నీ బ్రతుకు ఇంటిని కట్టుకోవయ్యా నీ బ్రతుకు ఇంటిని కట్టుకోవమ్మా చావు వద్ద తీర్పు వద్ద కూలిపోని కాలిపోని నిత్య జీవం పొందరావయ్యా సజీవుడైన యేసు దేవుని స్వీకరించయ్యా నిత్య జీవం పొందరావమ్మా సజీవుడైన యేసు దేవుని స్వీకరించమ్మా (5)

Report Error