జాగోరే జాగోరే జాగు జాము

jaagooree jaagooree jaagu jaamu

🎵 TG-2557🌐 Telugu
పల్లవి

జాగోరే జాగోరే జాగు జాము రాతిరి యేసు జాము రాతిరి కాడ పుట్టినాడే భాయ్ (2) కన్నియ మరియ కన్నులు విరియ పూత రేకు వంటి బాలుడోయ్ పుట్టె పాకలోన ||జాగోరే||

1వ చరణం

దూతలు పాడే కమ్మని పాట కబురే తెచ్చింది తారలు మెరిసే తీరును చూడ వెలుగే వచ్చింది వెళ్లి గొల్లలు తేరి చూసిరి – ఘల్లు ఘల్లున చిందులు వేసిరి ఈ ప్రజల నేలె యేసయ్య వచ్చెనని పరుగులు తీసిరమ్మా వెలుగులు చిందే తారను చూసి తరలిరి జ్ఞానులమ్మా బోళము తెచ్చి కానుకలిచ్చి సాగిలపడిరమ్మా పోలి కేక పెట్టెనమ్మా – పొలిమేర దాటెనమ్మా ఆ పసిడి కిరణాల బాలుని చూసి ప్రకృతి మురిసెనమ్మా

Report Error