జీవింతు నేను ఇకమీదట

jeevinthu neenu ikameedata

🎵 TG-1812🌐 Telugu
పల్లవి

జీవింతు నేను ఇకమీదట – నా కొరకే కాదు యేసు కొరకే జీవింతును (2) నన్ను ప్రేమించిన – ప్రియ యేసు కొరకే నాకై ప్రాణమిచ్చిన – ప్రభు యేసు కొరకే జీవింతును జీవింతును (2)       ||జీవింతు||

1వ చరణం

నీ ఉన్నత పిలుపుకు లోబడదున్ – గురివైపునకే బహుమానము పొందగ పరుగిడుదున్ వెనుకవున్నవన్నీ మరతును – ముందున్నవాటి కొరకే నే వేగిరపడుదును నన్ను ప్రేమించిన యేసుని చూతును నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును గురి వైపుకే – పరుగెడుదును వెనుదిరుగను – వెనుదిరుగను శ్రమయైనా బాధైననూ – హింసయైనా కరువైనా ఎదురైననూ ఉన్నవైన రాబోవునవైనా – అధికారులైనా ఎతైనా లోతైననూ నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమనుండి నేను విడిపోదునా ప్రభు నీడనుండి జీవింతును – నా యేసుతో జయమిచ్చును – నా యేసుడే

Report Error