జీవితాంతము వరకు నీకే
jeevithaanthamu varaku neekee
🎵 TG-1640🌐 Telugu
పల్లవి
జీవితాంతము వరకు నీకే – సేవ సల్పుదునంటిని నీవు నాతో నుండి ధైర్యము – నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాంతము||
1వ చరణం
ఎన్ని యాటంకంబులున్నను – ఎన్ని భయములు కల్గిన అన్ని పోవును నీవు నాకడ – నున్న నిజమిది రక్షకా అన్ని వేళల నీవు చెంతనె – యున్న యను భవమీయవె తిన్నగా నీ మార్గమందున – పూనినడచెద రక్షకా నేత్రములు మిరుమిట్లు గొలిపెడి – చిత్రదృశ్యములున్నను శత్రువగు సాతాను గెల్వను – చాలు నీ కృప రక్షకా నాదు హృదయమునందు వెలుపట – నావరించిన శత్రులన్ చెదర గొట్టుము రూపుమాపుము – శ్రీఘ్రముగ నారక్షకా మహిమలో నీవుండు చోటికి – మమ్ము జేర్చెదనంటివే ఇహము దాటినదాక నిన్ను – వీడనంటిని రక్షకా పాప మార్గము దరికి బోవక – పాత యాశల గోరక ఎపుడు నిన్నే వెంబడింపగ – కృప నొసంగుము రక్షకా