జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా

jeevithamantee maatalu kaadu chellemmaa

🎵 TG-1842🌐 Telugu
పల్లవి

జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా (ఇవి) మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా – (2)       ||జీవితమంటే||

1వ చరణం

నమ్ముకున్నాడు యోసేపు – అమ్ముకున్నారు అన్నలు నమ్ముకున్నాడు ఏశావు – మోసగించాడు యాకోబు (2) ఈ అన్నల నమ్మే కంటే… ఈ అన్నల నమ్మే కంటే అన్న యేసుని నమ్ముకో రాజ్యం నీదే మేలుకో పరలోకం నీదే ఏలుకో ||జీవితమంటే||

2వ చరణం

నమ్ముకున్నాడు యేసయ్యా – అమ్ముకున్నాడు శిష్యుడు పాపుల కొరకై వచ్చాడమ్మా – ప్రాణాలే తీసారమ్మా ఈ మనుషులలోనే… ఈ మనుషులలోనే – మమతలు లేవు మంచితనానికి రోజులు కావు సమయం మనకు లేదమ్మా ఇక త్వరపడి యేసుని చేరమ్మా నమ్మకమైన వాడు – ఉన్నాడు మన దేవుడు నమ్మదగినవాడు – వస్తాడు త్వరలోనే యేసుని రాకకు ముందే… యేసుని రాకకు ముందే మారు మనస్సును పొందుమా ప్రభుని చెంతకు చేరుమా రక్షణ భాగ్యం పొందుమా

Report Error